నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన.. వివరాలివే..!

-

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాల పర్యటనును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ నియోజకవర్గంలో నేడు చంద్రబాబు పర్యటిస్తారు. అక్కడ జరిగే బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు.

టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మొదట ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో గల దల్లవలస గ్రామంలో నుంచే ఈ టూర్‌ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకి వివరించడమే టీడీపీ ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. పన్నులు, ఛార్జీలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని బాదుడే బాదుడు పేరుతో నిరసనలను టీడీపీ చేపడుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇన్‌చార్జీగా ఉన్న ఆమదాలవలస నియోజకవర్గంలోనే పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు చంద్రబాబు.

చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించి చాలా రోజులైంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండుసార్లు వచ్చినా శ్రీకాకుళంలో మాత్రం అడుగుపెట్టి చాలా కాలమైంది. అందుకే చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లి మళ్లీ పుంజుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version