సిగ్గుతో తలదించుకోవాల్సిందే : చైత్రా ఘటనపై పవన్‌ ఎమోషనల్‌

-

హైదరాబాద్‌ లోని సైదాబాద్‌ చిన్నారి చైత్ర కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్‌ అగ్ర హీరో పవన్‌ కళ్యాణ్‌ పరామర్శించారు. కాసేపటి క్రితమే.. సైదాబాద్‌ వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌… బాధిత కుటుంబం తో మాట్లాడి… ఓదార్చారు. వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.

pawan kalyan

సైదాబాద్‌ లో జరిగిన ఈ దారుణం తనను బాగా కలచి వేసిందని పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అందరం సిగ్గు తో తలదించు కోవాల్సిన ఘటన ఇది అని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌. ఈ ఘటన లో నిందితున్ని త్వరగా పోలీసులు పట్టుకోవాలని కోరారు. అంతేకాదు.. ఈ దారుణ ఘటనానికి పాల్పడ్డ నిందితుడిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు పవన్‌ కళ్యాణ్‌. కాగా.. ఇప్పటికే సైదాబాద్‌ చిన్నారి చైత్ర కుటుంబాన్ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ నిన్న పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ పవన్‌ కళ్యాణ్‌… వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version