ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ..

-

క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించింది ఐపీఎల్‌ యాజమాన్యం. ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌ లకు అభిమానులకు కూడా అనుమతిస్తున్నట్లు గా అఫీషియల్‌ అనైన్స్‌ చేసింది. కరోనా కారణంగా ఐపీఎల్‌ 2021 కు మధ్య లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సీజన్‌ లో మిగిలిన మ్యాచ్‌ లు సెప్టెంబర్‌ 19 నుంచి మొదలు కాబోతున్నాయి.

కరోనా పరిస్థితులు తగ్గు ముఖం పట్టడం తో.. ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు ప్రేక్షకులను అనుమ తించాలని నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం లో సెప్టెంబర్‌ 19 న ముంబై మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ అభిమానుల్లో సందడి తీసుకువచ్చింది. ఇక ఈ మ్యాచ్‌ తో పాటు టోర్ని లో మిగిలిన మ్యాచ్‌ లకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్‌ 16 నుంచి ఆన్‌లైన్‌ అందుబాటు లో ఉండనున్నాయి. అధికారిక వెబ్‌ సైట్‌ www.iplt20.com తో పాటుగా PlatinumList.net లో కూడా టికెట్స్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version