NARAPPA : ”నారప్ప” నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

-

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నారప్ప”. ఈ సినిమా లో హీరో వెంకటేష్ మధ్య వయసుడిగా నటిస్తుంటే… ఆయన సరసన ప్రియమణి నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెట్రిమారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తమిళంలో మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో నిండిన ఈ కథతో ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇక ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాను రూపొందించాలని ఉద్దేశంతో దర్శకనిర్మాతలు, ఈ చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ కూడా పూర్తి అయింది. ఈ మూవీకి మణిశర్వ సంగీతం అందిస్తున్నారు.

అయితే… తాజాగా మణిశర్వ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘చలాకీ చిన్నమ్మి’ అనే సాంగ్‌ ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సాంగ్‌ శ్రోతలను ఎంతగానో అలరిస్తోంది. ‘నారప్ప’ ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకు యు/ఎ సర్టిఫికెట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version