టిడిపి ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని… టిడిపి హయాంలో పదివేల కోట్లతో అభివృద్ధి చేసామన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్, జగన్ అన్ని రకాలుగా సహకరించుకున్నారని… కేసీఆర్, జగన్ ఒకటే..ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని ఫైర్ అయ్యారు.
కేసీఆర్, జగన్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ అని చురకలు అంటించారు కేశినాని నాని. ముగ్గురూ ఒకటేనని… రెండు రాష్ట్రాలను దోచుకోవడానికి ముగ్గురూ కలసి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులు, పెట్టుబడులు హైదరాబాద్ లో ఉన్నాయని… జగన్, కేసీఆర్ కు సరెండర్ అయ్యాడన్నారు.
ఆ విషయం ప్రజలకు కూడా అర్థం అవుతుందని… కేసీఆర్ నీటి వాటాల కోసం సవాల్ చేస్తుంటే జగన్ ఏమి చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. మేము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అరెస్టు లు చేసి, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు, హక్కులు కోసం పోరాటం చేయాల్సింది జగన్, వైసీపీ నేతలేనన్నారు.