కొండా మురళి చేసిన పనులకు దేవుడే శిక్ష వేస్తాడు : ఎమ్మెల్యే చల్లా

-

బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొండా మురళిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల కొండా మరళి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘దమ్ముంటే పరకాలకు రా.. నా మీద పోటీ చేసి గెలువు’ అని కొండా మురళి దంపతులకు చల్లా ధర్మారెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లపై అనుచితంగా మాట్లాడితే ప్రజలే కొండా మురళిని ఉరికించి కొడతారని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా మురళి ఇష్టమొచ్చినట్టు కుక్కలా మాట్లాడటం మానుకోవాలని, కొండా సురేష్, ఆమె కూతురు సైతం పద్దతి లేకుండా మాట్లాడటంపై మండిపడ్డారు చల్లా ధర్మారెడ్డి. అసలు వాళ్ల భాష ఏమిటని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా మాట్లాడటం మానుకోవాలని సూచించారు.

కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించారన్నారు. అందర్ని అక్కున చేర్చుకోవాలని కేసీఆర్ భావించి కొండా దంపతులకు రాజకీయ భిక్ష పెట్టారని అయినా ఆ గౌరవాన్ని నిలుపుకోలేక పోయారన్నారు.మాట్లాడితే మగతనం గురించి మాట్లాడుతారు.. ఎలా నిరూపించుకోవాలో చెప్పాలన్నారు.అసలు వరంగల్ అభివృద్ధిలో కొండా మురళి పాత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. రాజకీయ పునర్జన్మనిచ్చిన కేసీఆర్‌పై అవాకులు చవాకులా? మగతనం ఉండాలంటే మీసాలు ఉండాలా? అన్నారు. కొండా మురళి ఏం చేసి అన్ని ఆస్తులు కూడబెట్టారోచెప్పాలని డిమాండ్ చేశారు. అందర్నీ తిట్టే రకం కొండా మురళి అని, రేపు రేవంత్ రెడ్డిని కూడా తిడతారన్నారు. సోనియాను కేసీఆర్‌ను జగన్‌ను ఇదివరకే తిట్టారని ఆ విషయాన్ని ప్రజలు సైతం గుర్తుంచుకున్నారన్నారు. కొండా మురళి చేసిన పనులకు దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version