రాష్ట్రంలో భానుడి భగభగలకు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరో 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని IMD వెల్లడించింది.ఉదయం 7 గంటల నుంచే భానుడు నిప్పులు కక్కుతున్నాడు.దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండలకు తోడు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్‌లు కొనసాగుతున్నాయి.
ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లిపూర్‌లో 46.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8, నల్లగొండ జిల్లా తెల్దేవారపల్లెలో 46.7 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పేర్కొంది.