ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ ఒకరోజు సాధారణ సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఉద్యోగుల అభ్యర్థన మేరకు సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. సంబంధిత విభాగాల అధిపతులు, కలెక్టర్లు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, ఈనెల 13వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి.ఇక ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేస్తూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ.. ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇక ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది.