నేను పోటీ చేయను..చంద్రబాబు

-

తెలంగాణ అంటే నాకు ఎంతో ఇష్టం, ఈ ప్రాంతంతో నాకు విడదీయరాని బంధం ఉంది. బుధవారం ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం పాలనా వైఫల్యాలను, కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను విమర్శించారు. 37 ఏళ్లుగా కాంగ్రెస్‌, తెదేపాలు పరస్పరం పోరాడాయి. ఈ రెండు రెండు పార్టీలు దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం కలిశాయి. తెలంగాణలో ప్రజా కూటమి విజయం చారిత్రక అవసరం అన్నారు. కేసీఆర్ ఏ సభ పెట్టిన నన్ను తలవకుండా ఉండటం లేదు.. మాట్లాడితే.. నేనేదో పెత్తనం చేస్తానంటున్నారు. నేను ఏపీకి సీఎంగా ఉంటాను. నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసే ఆలోచనే నాకు లేదు. నాడు నేడు ఎప్పుడైనా సరే తెలంగాణలో ప్రజల అభ్యున్నతికి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నా అన్నారు.తెలంగాణ కింద ఉన్న ఏపీ నీళ్లకు అడ్డు పడుతోందని మాట్లాడటం ఎంతవరకు సబబు? దేవాదుల, మాధవరెడ్డి ఎత్తిపోతల, భీమ తదితర నీటిపారుదల ప్రాజెక్టులకు నేనే నాంది పలికాను.

తెలుగుజాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తా. నేను సైబరాబాద్‌ను నిర్మించానని గొప్పగా చెప్పుకుంటా… ఆ మాటలను సైతం కొంత మంది వక్రీకరించి నేనే హైదరాబాద్ కట్టానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. నాడు తెలంగాణ విభజన సమయంలో పద్ధతిగా చేయమన్నాను. మోదీ ప్రభుత్వ విధానాల కారణంగా దేశం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు అవకాశాలిస్తే ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాధిస్తారన్నారు. తెలుగు జాతి కలిసి ఉండాలని ఆనాడే చెప్పాను. సమన్యాయమని చెప్పాను తప్ప ఏకపక్షంగా విభజన చేయాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. నేను ఏపీ కి రావాల్సిన నిధులపై, హక్కులపై పోరాటం చేస్తున్నాను…కానీ కేసీఆర్ మాత్రం మోదీ ని ఒక్క మాట కూడా అనకపోవడం చాలా విచిత్రంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news