ఎన్నో అంచనాలతో అధికారం దక్కించుకోవాలని అనుకున్న సైకిల్ ఫెయిల్ అయింది…కమలం ధాటికి సైకిల్ సవారీకి బ్రేక్ పడింది. తాజాగా వెలువడిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నేతృత్వంలోని బీజేపీ సూపర్ విక్టరీ కొట్టి రెండోసారి అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే…ఇక ఈ సారైనా అధికారం దక్కించుకోవాలని అనుకున్న ఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే యూపీలో మళ్ళీ బీజేపీ గెలవడానికి కారణాలు ఉంటే…ఎస్పీ గెలవకపోవడానికి కూడా పలు కారణాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ అఖిలేష్ యాదవ్ టీంలో కనిపించింది. ఎందుకంటే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేస్తామనే ధీమా ఎస్పీ నేతల్లో కనిపించింది. ఎందుకంటే అప్పటికే యోగి సర్కార్ పై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. హత్రాస్, రైతు ఉద్యమాలు, కార్లతో రైతులని తొక్కించడం లాంటి ఘటనలు జరిగాయి…ఇంకా పలు రకాల ఘటనలు జరిగాయి. ఈ పరిణామాలు యోగి ప్రభుత్వానికి బాగా నెగిటివ్ అయిందని అంతా అనుకున్నారు.
ఇదే తమకు కలిసొస్తుందని ఎస్పీ భావించింది..ఇంకేముందో తాము గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని అఖిలేశ్ భావించారు..కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎస్పీని దెబ్బతీసింది..ప్రజల్లోకి ఎక్కువ వెళ్లకుండా పైకి ఏదో వ్యతిరేకత ఉందని ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది…రెండోసారి ఎస్పీ అధికారానికి దూరమైంది. ఇక ఎస్పీ సింబల్ సైకిల్ సత్తా చాటలేకపోయింది.
సేమ్ యూపీలో మాదిరిగానే ఏపీలో కూడా సైకిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళితే దెబ్బతినడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు…జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇంకా నెక్స్ట్ తామే అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకుంటున్నారు..అసలు తమకు 160 సీట్లు వచ్చేస్తాయని ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఇక ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళితే దెబ్బతింటామని కొందరు టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.. మీడియాలో, పార్టీ ఆఫీసులో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రజల్లోకి వెళ్ళి వారి మద్ధతు పొందితేనే లాభమని అంటున్నారు. చూడాలి మరి యూపీలో అఖిలేశ్ మాదిరిగానే ఏపీలో బాబు కూడా దెబ్బతింటారేమో.