బాబు రాజకీయం అర్ధం కాదు… అచ్చెన్నకూ వెన్నుపోటు!

-

సామాన్యుడికే కాదు.. రాజకీయ పండితులకు కూడా పూర్తిగా అర్ధంకాదు చంద్రబాబు రాజకీయం! అచ్చెన్నాయుడు అరెస్టు అనంతరం ఆ నేరం.. అచ్చెన్న అభిమానుల దృష్టిలో బాబుపై పడకుండా… రామ్మోహన్ నాయుడిని నెత్తినపెట్టుకున్నట్లుగా… తనకు లోకేష్ ఒకటి రామ్మోహన్ ఒకటి కాదు.. ఇద్దరూ సమానమే అన్న రేంజ్ లో స్పందించిన బాబు.. అచ్చెన్న విడుదల అనంతరం ప్లేట్ ఫిరాయించారు! అది కూడా ఫైనల్ కాదు సుమా!!

అవును… అచ్చెన్న అరెస్టులో ఉన్నంతకాలం రామ్మోహన్ నాయుడికే, ఎర్రన్న కుటుంబానికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అని చెప్పిన బాబు… అనంతరం అచ్చెన్న విడుదలయ్యి వచ్చారు కదా అని ఆయనకే పదవి ఆఫర్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో అచ్చెన్నను మరీ హీరోని చేసేస్తున్నామని భావించారో.. లేక, పోటీ లేకపోవడం వల్ల అచ్చెన్నాకు ఆ పదవి వచ్చింది అనే పేరు రాకుండా… చాలా పోటీ ఉన్నా కూడా అచ్చెన్నకే ఇచ్చారని అనిపించుకోవాలనో తెలియదు కానీ… కొత్త పేరు ఒకటి తెరపైకి తెచ్చారు టీడీపీ నేతలు!

తాజాగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పేరు రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తెరపైకి వచ్చింది. నిజంగా అచ్చెన్నాను హీరోని చేయడం ఇష్టం లేక ఈ పేరు తెరపైకి వచ్చిందా లేక పోటీ ఉన్నా కూడా బాబు, అచ్చెన్న వైపే మొగ్గుచూపారని బిల్డప్ ఇవ్వడం కోసం బీదను బలిపశువును చేశారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి! ఏది ఏమైనా… అచ్చెన్న విషయంలో బాబు రాజకీయ తారాస్థాయికి చేరిందనేది మాత్రం ఆన్ లైన్ వేదికగా బలంగా వినిపిస్తోన్న కామెంట్!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version