కడప జిల్లాలో కొత్త రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి జగన్ దాకా ఆ జిల్లా ప్రజల ఆదరణ పొందుతున్నారు. ముఖ్యంగా కడప పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల విషయంలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఫ్యామిలీ వైయస్సార్ రాజకీయ ప్రవేశం నుండి ఇప్పటి దాకా కడపలో ఇతర పార్టీలు ప్రజలు ఆదరించలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకు కారణం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడం.
అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కి వివేకా హత్య బాగా కలిసొచ్చింది అయితే అధికారంలోకి వచ్చాక జరిగిన పరిణామాలు ఆయన మీద వ్యతిరేకతను తీసుకువచ్చాయి వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే వివేకా కి చెందిన వాళ్ళని రంగంలోకి దించాలని చూస్తున్నారు. వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ని కడప ఎంపీ బారి లోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.