బండి సంజయ్ కల్లు తాగారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం లింగాపుర్ గ్రామంలో ఆకు పట్టి కల్లు తాగారు బండి సంజయ్. అనంతరం కల్లు గీత కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు సంజయ్. కల్లు గీత కార్మికుడి తో ముచ్చటిస్తూ.. ఈ గ్రామంలో ఎంతమంది కల్లు గీత కార్మికులు ఉన్నారు! ఎంత కల్లు అవుతుంది? ఆదాయం ఎంత ? వగైరా అంశాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు.
సరదాగా గౌడన్న మోకు వేసుకొని గౌడన్నలను ఉత్సాహపర్చిన సంజయ్…కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వెల్లడించారు. అరోగ్య నిపుణులు సైతం ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేసిన సంజయ్… వైన్స్, బార్లు పెట్టీ కేసీఆర్ గౌడన్నల పొట్ట కొట్టిండంటూ ఫైర్ అయ్యారు. 73 ఏళ్ల వయసు పై బడిన గౌడన్నలు ఇప్పటికీ కల్లు గీసి పోస్తున్నారని కొనియాడారు. తాడిచెట్లువున్న దగ్గర షెడ్లు వేయిస్తున్నాని గౌడన్న కు తెలిపారు సంజయ్.