సీఎం జ‌గ‌న్‌కు మ‌రోసారి స‌వాల్ విసిరిన‌ చంద్ర‌బాబు..

-

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి స‌వాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రిఫరెండం చుట్టూ తిరుగుతున్నాయి. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఛాలెంజ్ చేస్తే మంత్రి అవంతి శ్రీనివాస్..విశాఖపై రిఫరెండానికి వెళతామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఏపీ రాజధాని తరలింపుపై రాష్ట్రంలో దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు.

జగన్‌కు దమ్ముంటే మూడు రాజధానులపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని అన్నారు. ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశం లేకపోతే మూడు రాజధానుల విషయమై రిఫరెండం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version