జగన్‌ ఆ పని చేస్తే.. నేనూ శభాష్ అంటా.. చంద్రబాబు

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా తన పాత రూటు వదిలిపెట్టడం లేదు. పాడిందే పాటలా అంటూ ఎన్నికల ముందు వల్లించిన డైలాగులే కాస్త అటూ ఇటూ తిప్పి వదులుతున్నారు. ఈ రోజు సీబీఐ కోర్టు జగన్ పై కామెంట్లు చేయడంతో వాటిని ప్రస్తావిస్తూ మరోసారి జగన్ పై విమర్శలకు దిగారు చంద్రబాబు.

ముఖ్యమంత్రిగా పరిపాలనలో బిజీగా ఉన్నందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. అలా కుదరదని కామెంట్ చేసింది. సీఎంగా సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్టు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు మరోసారి తన విమర్శలకు పదును పెట్టారు.

జగన్‌ జైళ్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసినందున, సీఎంగా మరింత చేయగలడన్న సీబీఐ వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రవర్తన అర్థం కాకుండా ఉందంటున్నారు చంద్రబాబు.

అవినీతి నియంత్రణకు దేవుడే తనను పంపాడని జగన్ చెపౌకోవడం సిగ్గు చేటు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 43 వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడ బెట్టాడని సీబీఐ కేసుల్లో మునిగిన జగన్ నీతులు చెప్పడం విడ్డురమంటూ కామెంట్ చేశారు చంద్రబాబు. అవినీతి పాల్పడ్డ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించి జగన్ నిజాయితీని పాటించాలని సూచించారు.

అవినీతి పాల్పడ్డ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తే.. అప్పుడు తాను కూడా జగన్ ను అభినందిస్తానని ప్రకటించారు చంద్రబాబుఅయితే చంద్రబాబు ఇలా మాట్లాడటం ఇదేమీ కొత్త కాదు.. గత ఎన్నికల మొత్తం చంద్రబాబు ప్రచారమంతా ఇలాగే సాగింది. జగన్, కేసీఆర్, మోడీ మొత్తం దేశాన్నే దోచేస్తున్నారని ప్రచారం చేశారు చంద్రబాబు. కానీ జనం అవేమీ పట్టించుకోలేదు. చంద్రబాబు కూడా సీబీఐ కోర్టు తీర్పు వచ్చేవరకూ ఈ పాత ఆరోపణలు మాని జనం సమస్యలపై దృష్టి పెడితే బెటర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version