Sye Raa Review : సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ

-

రివ్యూ: సైరా న‌ర‌సింహారెడ్డి
బ్యాన‌ర్‌: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ
న‌టీన‌టులు: మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ అమితాబ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, నిహారిక, బ్ర‌హ్మాజీ, పృథ్వి త‌దిత‌రులు
డైలాగ్స్‌: సాయి మాధ‌వ్ బుర్రా
ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌
ఫైట్స్‌: జార్జ్ పావెల్ – రామ్ ల‌క్ష్మ‌ణ్ – లీ విట్టాక‌ర్‌
ఎడిటింగ్‌: ఏ.శ్రీక‌ర ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.ర‌త్న‌వేలు
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
నిర్మాత్‌: రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల‌
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్‌రెడ్డి
రిలీజ్ డేట్‌: 02 అక్టోబ‌ర్‌, 2019
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 170.50 నిమిషాలు

మెగా అభిమానుల‌కు పండుగ రోజు రానే వ‌చ్చింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సైరా న‌ర‌సింహారెడ్డి ఈ రోజు విడుద‌ల అయింది. మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార, త‌మ‌న్నా హీరోహీరోయిన్లుగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్,కిచ్చా సుదీప్,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, జ‌గ‌ప‌తిబాబు వంటి ప్ర‌ముఖ న‌టుల‌తో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సైరా న‌ర‌సింహారెడ్డిని తెర‌కెక్కించారు. తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా గుర్తింపు పొందిన ఉయ్యాల‌వాడ‌ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కించిన ఈ బ‌యోగ్ర‌ఫీ మెగా అభిమానుల‌ను ఏమేర‌కు ఒప్పించిందో తెలుసుకున ప్ర‌య‌త్నం చేద్దాం.

క‌థేమిటంటే…

ముందుగా క‌థ విష‌యానికి వ‌ద్దాం… ఉయ్యాల‌వాడ‌ న‌ర‌సింహారెడ్డి తెలుగువాడు. మొట్ట‌మొద‌టి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు. 18వ దశాబ్దంలో రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి (చిరంజీవి). బ్రిటిషు దేశస్థులు భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో రేనాడును ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్ర‌మంలోనే వాళ్లు పంట పండ‌క‌పోయినా శిశ్తు క‌ట్టాల‌ని ఆ ప్రాంతంలో ఉన్న 61 మంది పాలెగాళ్ల‌కు హుకుం జారీ చేస్తారు. దీనికి ఎదురు తిరుగుతాడు సైరా. చివ‌రకు శిశ్తు పోరాటం కాస్త ముదిరి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దేశ స్వాతంత్య్రం కోసం వారికి ఎదురు తిరుగుతాడు. అయితే.. బ్రిటీష్‌వాళ్ల‌ను ఎదిరించే క్రమంలో అవుకు రాజు(సుదీప్), రాజ పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతి బాబు)లు ఎలా న‌ర‌సింహారెడ్డితో క‌లిసి వ‌చ్చారు..? ఆ తర్వాత నరసింహా రెడ్డి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఈ జ‌ర్నీలో ఆయ‌న‌కు సిద్ధ‌మ్మ (న‌య‌న‌తార‌), వీర‌వెంక‌ట మ‌హాలక్ష్మి (త‌మ‌న్నా)కు ఉన్న లింక్ ఏంటి ? ఈ పోరాటంలో ఆయ‌న తుదిశ్వాస వ‌ర‌కు నిల‌బ‌డ్డారా లేదా.. అన్న‌ది మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.

ఎలా ఉందంటే…

చిరు 151వ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. తెర‌పై సినిమా చూస్తున్నంత‌సేపూ నిజంగా రోమాలు నిక్క‌బొడుస్తాయ‌ని చెప్పొచ్చు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌చ‌రిత్ర‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు. అయితే.. ముందుభాగంలో క‌థ కాస్త నెమ్మ‌దిగా న‌డిచిన‌ట్టు అనిపించినా.. రెండో భాగంలో మాత్రం క‌థా గ‌మ‌నం అద్భుతంగా సాగుతుంది. కొన్ని యాక్షన్ స‌న్నివేశాల‌ను, విజువల్స్ ను చూస్తుంటే మాత్రం నిజంగానే 18వ శతాబ్దంలో ఉన్నామ‌న్న భావన ప్రేక్ష‌కుల్లో క‌లుగుతుంది. ప్ర‌తీ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి చ‌క్క‌గా తీర్చిదిద్దారు. ప్ర‌ధానంగా చిరు,న‌య‌న‌తార మ‌ధ్య వ‌చ్చే ప‌లు ఎమోష‌న్‌ స‌న్నివేశాలు మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండిపోత‌యా. ఈ ప్రాజెక్టును త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా ఎందుకు చెప్పారో ఈ సినిమ ఆచూస్తే అర్థ‌మ‌వుతుంది.

సైరా సినిమా ఒక స్వాతంత్య్ర‌ సమర యోధుడు వీరత్వానికి, పౌరషానికి , ఔన్నత్యానికి దివిటీ అవుతుందనుకుంటే…… ఇది చరిత్ర కాదు. కల్పనే’ అని ఖరాఖండిగా చెప్పిన సురేంద్రరెడ్డి…కొంచెం నిరుత్సాహం కలిగించాడు. అయితే బ్రిటీష్ వారితో చివరి వరకూ పోరాడి, ఓడి,గెలిచి,ఉప్పెనలాంటి ఓ పోరాటానికి స్పూర్తిని ఇచ్చిన నరసింహారెడ్డి ని మన ముందు నిలిపాడనటంలో సందేహం లేదు. సినిమా క‌ల్పన అయినా… చ‌రిత్ర చాలా చోట్ల వ‌క్రీక‌రించినా సినిమాగా చూడ్డానికి బాగుంది. ఏదేమైనా సినిమాలో మ‌నం నిమగ్నం అవడానికి స్ఫూర్తి పొందడానికి కీర్తించుకోడానికి కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది.

ఎవ‌రెలా చేశారంటే..

తొలి స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఒదిగిపోయారు. చిరు న‌ట‌న‌ను చూస్తుంటే.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి నిజంగా ఇలాగే ఉండేవారా..? అని అనిపిస్తుంది. ఆరుప‌దుల వ‌య‌స్సులోనూ ఆయ‌న ఎంత ఎన‌ర్జిటిక్‌గా క‌నిపించారంటే.. చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు. ఇక మిగ‌తా న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక అన్నికంటే ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది రత్నవేలు అందించిన కెమెరా పనితనం. సినిమాకు అద‌న‌పు బ‌లంగా నిలుస్తుంది. అలాగే సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన పాటలు బాగానే ఉన్నాయి. జూలియస్ పకియం అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలిచింద‌ని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ (+) :
– భారీ సెట్టింగులు మరియు విఎఫ్ఎక్స్
– సినిమాటోగ్రఫీ
– నిర్మాణ విలువలు
– చిరు అమేజింగ్ పెర్సామెన్స్‌

మైనస్ పాయింట్స్ (-) :
– కాస్త నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్
– కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
– చ‌రిత్ర వక్రీక‌ర‌ణ‌

ఫైన‌ల్‌గా….

మొత్తంగా చూసుకున్నట్టయితే తొలి తెలుగు స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర మీద తెరకెక్కించిన సైరా నరసింహా రెడ్డి చిరంజీవి అద్భుత పెర్ఫామెన్స్ మరియు థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సెకండాఫ్ ఆకట్టుకున్నా కాస్త నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్ లోని కథనం సినిమా నిడివి ఎక్కువ కావడం వంటివి నిరాశపరుస్తాయి. సినిమాను క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో కాకుండా ఓ చారిత్ర‌క యోధుడి క‌థ తెలుసు కునే విష‌యంలో చూస్తే సైరా సూప‌ర్ హిట్టే.

సైరా రేటింగ్‌: 3.5 / 5

Read more RELATED
Recommended to you

Exit mobile version