బాబు ఏపీకి ఎందుకు రావడంలేదో తెలిసిపోయిందంట!

-

తాను లేకపోతే ఏపీ లేదు అనే స్థాయిలో ప్రగల్భాలు పలికే చంద్రబాబు… నేడు ఇంత క్లిష్ట సమయంలో కీలక సమయంలో తానే ఏపీలో లేకుండా పోయారు! ఈ పరిస్థితుల్లో ఎందుకు ఆయన అలా చేస్తున్నారు.. ఆయన తలచుకుంటే రెండు రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాసి అనుమతి తీసుకుని ఏపీకి వెళ్లొచ్చు… అయినా కూడా జూం యాప్ కి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పెద్ద మనిషి ఈ కరోనా టైంలో ఏపీకి ఇంత కష్టం వచ్చినా ఎందుకు రావడం లేదు… ఎందుకు హైదరాబాద్ లో ఇంటినుంచి గడప బయట కాలుపెట్టడం లేదు? దీనంతటికీ కారణం ఒక డాక్టర్ అని కథనాలు వస్తున్నాయి!

ఏపీ మొత్తం కరోనా కష్టంలో ఉంటే బాధ్యత గలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి పట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పాటు… ఏపీకి కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు ఎందుకు ఇక్కడి ప్రజలకు భరోసాగా ఉండటం లేదని వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది.. కుప్పం నియోజకవర్గం అయితే ఏకంగా “మా ఎమ్మెల్యే కనిపించడం లేదు” అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులే చేసింది. అయినా కూడా బాబు నుంచి నో రెస్పాన్స్! పోనీలే పెద్దమనిషి నాలుగు రోజుల క్రితం 70 ఏళ్ల నిండిన పెద్ద్దాయనకు ఏదో సమస్య ఉండి ఉండొచ్చులే అనుకుంటున్న సమయంలో ఒక సీక్రెట్ వెలుగులోకి వచ్చిందంట! అదేంటయ్యా అంటే… చికాగో డాక్టర్ ఒకరు బాబుకు ఒక సలహా చెప్పారంట.

అవును… ఈ మధ్యకాలంలో చంద్రబాబు చికాగో డాక్టర్ తో వైద్య పరీక్షలు చేయించుకున్నారు… దాంతో బాబుకి షుగర్, బీపీలతో కలిపి అన్ని దీర్ఘకాలిక వ్యాధులూ ఉన్నాయంట. అందుకే ఈ పరిస్థితుల్లో మీకు కరోనా వస్తే… ఇంక ఆపడం కష్టమని.. అందుకే ఇంటికే పరిమితం కావాలని సదరు డాక్టర్ సూచించారంట. ఆ కారణంతోనే బాబు హైదరాబాద్ వదిలి రావడం లేదని… ఏపీకి వస్తే క్వారంటైన్ కు పంపుతామని ఏపీ మంత్రుల మాటలను సాకుగా చూపించి.. అక్కడే ఉంటున్న్నారు తప్ప మరొకటి కాదని చెబుతున్నారంట! ఈ విషయాలు తెలియనివారు మాత్రం… నిజంగా వైకాపా మంత్రుల మాటల వల్లే బాబు ఏపీకి రాలేకపోతున్నారని వస్తున్న కథనాలు అసత్యాలు అన్న మాట!! పోనీలే బాబు… టేక్ రెస్ట్!

Read more RELATED
Recommended to you

Latest news