టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నరసారావుపేటలో జరిగిన కోడెల సంస్మరణ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. అలాగే కోడెల విగ్రహాలకు కూడా అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు అనుమతులు ఇచ్చారని వైఎస్ విగ్రహాలు పెట్టారని ప్రశ్నించారు. కొన్ని వేల వైఎస్ విగ్రహాలను రోడ్లుపై ఏర్పాటు చేశారు. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
సిటీలో ఏర్పాటు చేసినా.. గ్రామాల్లో నిర్మించినా.. ఎక్కడా అనుమతలు తీసుకోలేదు. అనుమతుల్లేని విగ్రహాలు తీసేయ్యాలని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. పనిచేసిన వాళ్లకు బిల్లులు చెల్లించకుండా.. వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారన్నారు. జగన్‌లా తాము దోపిడీ చేయలేదని.. చట్టపరంగా పనులు చేశామన్నారు. కోడెల కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. కోడెల మెమోరియల్‌ను ఏర్పాటు చేస్తామని, ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకెళ్లాలన్నారు.