శాపంతో ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం.. ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు..

-

తలకాడు పట్టణం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. పక్కనే కావేరీ నది.. కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ‘తలకాడు’ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇక్క‌డ సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో ఐదు ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. ఈ అయిదు శివాలయాలనీ కలిపి పంచలింగాలుగా పిలుచుకుంటారు.

ప్రస్తుతానికి ఈ ఆలయాలలో చాలావరకు ఇసుకదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాలలోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది. ఓ క‌థ‌నం ప్ర‌కారం.. ఈ ప్రాంత దేవత అయిన ఆలమేరు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడుపై తన సైన్యంతో దాడి చేస్తాడు. అమ్మవారు తన నగను కావేరి నదిలో పడవేసి మునిగిందని, పోతా పోతా తలకాడును ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసుడు లేకుండా పోతాడని శపించిందని స్థానిక కధనం.

వేల ఏళ్ల చరిత్ర కలిగి, నదీతీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. తలకాడు ఐదు ప్రఖ్యాత శివాలయాలకు ప్రసిద్ధి చెందినది. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version