ఇవాళ మీ పాపాలే.. శాపాలుగా మారతాయి : చంద్రబాబు

-

అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. సీఐడీ ఆఫీస్ టార్చర్ ఆఫీసుగా మారిందన్నారు. అంతేకాకుండా.. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తారా..? అయ్యన్నపై రేప్ కేసు పెడతారా..? కోర్టులు చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వానికి బుద్ది రాలేదు. సీఐడీలో ఉండేవారి చరిత్ర ఏంటీ..? కేవలం రెండు సెంట్లు ఆక్రమించుకున్నారంటూ అడ్డగోలు కేసు పెడతారా..? జగన్ లాగా ఎవ్వరి అకౌంట్లకు డబ్బు రాలేదే..? అచ్చెన్నాయుడు అకౌంట్లకు డబ్బు రాలేదే..? 24 మంది బీసీ నేతలను చంపేస్తారా..? బీసీల్లో నాయకత్వం రావడం చాలా కష్టం. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న బీసీ నేతలను ఇబ్బంది పెడతారా..? ఎంపీ సీటు కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని జగన్ రక్తం పంచుకున్న చెల్లి షర్మిళే చెప్పింది. వైఎస్ వివేకా హత్య చేసిన వాళ్లను రక్షించేది ఎవరో జగన్ చెప్పగలరా..? వైఎస్ వివేకా హత్య విషయంలో వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ ఛార్జీ షీటులో చెప్పింది.

ఇలాంటి విషయాలు చర్చకు వస్తాయని.. అయ్యన్నని అరెస్ట్ చేస్తారా..? సీబీఐకు వ్యతిరేకంగా సీఐను మార్చిన వాళ్లు.. అయ్యన్నకు వ్యతిరేకంగా ఎవరినైనా మార్చగలరు. ఇవాళ మీ పాపాలే.. శాపాలుగా మారతాయి. తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై కచ్చితంగా చర్యలుంటాయి. ఇదంతా రికార్డుల్లో ఉంటుంది గుర్తు పెట్టుకోండి. ఇలాంటి పనులు చేస్తూ.. 175 సీట్లు సాధిస్తారట. ఎన్నికలైన వెంటనే జగన్ జైలుకెళ్తారు.. వైసీపీ బంగాళాఖాతంలోకి వెళ్తోంది. ఇళ్లల్లోకి జొరబడొచ్చని రాజ్యాంగంలో చెప్పారా..? అయ్యన్న ఏమైనా టెర్రరిస్టా..? గోడలు దూకి ఇళ్లల్లోకి పోలీసులు ఎలా వస్తారు..? సాక్షులను ప్రభావితం చేసే శక్తి ఉందని అయ్యన్నను అరెస్ట్ చేస్తారా..? సీఎం హోదాలో ఉండి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్న సీఎంను అరెస్ట్ చేస్తారా..?అయ్యన్న కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు పైనే అధికారులను శిక్షించవచ్చు. అయ్యన్న తనయుడు రాజేషును కొట్టారని మాకు సమాచారం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు శిక్ష పడడం ఖాయ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version