ఒక్క రోజులో నలుగురు అన్నదాతల ఆత్మహత్యలా? : చంద్రబాబు

-

ఒక్క రోజులో నలుగురు అన్నదాతల ఆత్మహత్యలా? రాష్ట్రంలో రైతాంగ సంక్షోభం – ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయని, నిన్న ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 గురు రైతులు బలవన్మరణాలు పొందడంపై తీవ్ర ఆవేదన కలిగిస్తోందన ఆయన మండిపడ్డారు. ఒక్క రోజులో ఒక్క జిల్లాలో నలుగురు రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు చంద్రబాబు.

రైతు సమస్యలపై ప్రభుత్వ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, సాగుకు సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతలను కోల్పోయిన పరిస్థితిని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలన్నారు చంద్రబాబు. ప్రభుత్వం తన నిర్ణయాలు, చర్యల ద్వారా రైతులు, కౌలు రైతులకు అండగా నిలవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో నేడు చంద్రబాబును యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. వైసీపీకి రాజీనామా చేస్తూ ఇటీవలే చంద్రబాబు అప్పాయింట్మెంట్ అడిగారు యార్లగడ్డ. అయితే.. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబుతో యార్లగడ్డ భేటీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version