పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పెన్షన్ పెంచనున్న కేసీఆర్

-

తెలంగాణలో పెన్షన్ దారులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే పెన్షన్ పెంచనున్నట్టు సూర్యపేట బహిరంగ సభలో చెప్పారు.  ముఖ్యంగా ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ అధికారంలోకి  వస్తే మళ్లీ పైరవీ కారుల రాజ్యమే అవుతుందన్నారు. మీ ఊర్లలో మోటార్లు కాలిపోతే  గతంలో ఏం చేసేవారో అందరికీ తెలుసు.  మాకు పెన్షన్ పెంచడం చేతకాదా..?   కాంగ్రెస్ తన జన్మల రూ.1000 పెన్షన్ ఇవ్వలేదు.  ఛతీస్ గడ్, రాజస్థాన్  లో కాంగ్రెస్ అధికారంలోనే ఉంది.. అక్కడ రూ.4వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

ధరఖాస్తు లేకుండా రైతు బంధు ఇస్తున్నాం. ధరణి వల్ల వెంటనే టింగుమని సెల్ ఫోన్ లు మోగుతున్నాయి. రైతు ల భూమిని మార్చాలంటే సీఎంకి కూడా పవర్ లేదు. భూమిని మార్చే అధికారం రైతు బొటన వేలుకు మాత్రమే ఉందన్నారు. నల్గొండలో అల్ట్రా మెగా ప్రాజెక్ట్ రాబోతుంది. రూ.37కోట్ల రైతు రుణమాఫీ చేశామని తెలిపారు కేసీఆర్. దేశంలో ఇంత పెద్ద రుణమాఫీ ఎక్కడ లేదన్నారు. త్వరలో పంజాబ్ ని మించి నాలుగు టన్నుల వడ్డు పండించనున్నామని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version