వెనుకటికి ఎవడికో క్షవరం అయితే గానీ వివరం తెలియలేదట. అలాగే ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు ఎన్ని సమరాలు చేసిన ఉపయోగం లేదని తేలిన కూడా…బాబుకు వివరం తెలిసేలా లేదు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ‘సమరం’ చేస్తూనే ఉన్నారు. సమరసింహారెడ్డిలో బాలయ్య బాబు మాదిరిగా.. జగన్ ప్రభుత్వంపై ఏకధాటిగా దాడి చేస్తూనే ఉన్నారు.
ఇలా మరీ గుడ్డిగా విమర్శలు చేయడం వల్ల నిజమైన సమస్యల విషయంలో పోరాటం చేసిన కూడా బాబుని ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు. ఇప్పటివరకు చంద్రబాబు అనేకరకాలుగా జగన్ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. అనేక సమస్యలని ఎత్తి చూపడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడా కూడా సక్సెస్ కాలేకపోయారు. ఏదో సొంత మీడియాని అడ్డం పెట్టుకుని జగన్‌ని నెగిటివ్ చేయాలని చూసిన సాధ్యం కాలేదు.
బాబు సమరాలు అన్నీ విఫలమయ్యాయని స్థానిక ఎన్నికలు రుజువు చేశాయి. అయినా సరే బాబు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా సమరమే అంటున్నారు. తాజాగా కరెంట్ ఛార్జీల పెరుగుదలపై సమరభేరి మోగిస్తామని అంటున్నారు. వాస్తవానికి ట్రూ అప్ పేరిట ఏపీలో కరెంట్ బిల్లులు బాదుడు ఎక్కువైంది. అయితే గత టిడిపి ప్రభుత్వం కారణంగానే ఇప్పుడు ట్రూ అప్ చార్జీల వసూలు చేయాల్సి వస్తుందని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా బాబు మాత్రం సమరమే అంటున్నారు. మరి ఈ సమరం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.