తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సీఎం కేసీఆర్ మంచి ఆలోచనలు చేస్తారు… ఆచరణ కూడా బాగుండాలని తెలిపారు. ప్రజలు సంశయానిక గురికాకుండా చూడాలని సూచనలు చేశారు రఘునందన్ రావు. డప్పు, చెప్పు పెన్షన్ ఇస్తా అన్నారు… అది ఆగిపోకుండా చూడాలని కోరారు. బ్యూరో క్రాట్స్ మాకు సరిగా ప్రాధాన్యత లేదని లేఖలు రాస్తున్నారని.. అలాంటి అపవాదులు లేకుండా చూడాలన్నారు.
మాదిగ వర్గీకరణకు తానే పెద్దన్న గా ఉంటా అని కెసిఆర్ చెప్పారని.. దానికి కట్టుబడి ఉండాలన్నారు. దళితులు మంత్రులు అయితే ఆత్మగౌరవం పెరుగుతుందని…తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే…సీఎం సరిదిద్దే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్‌ఎస్ వాళ్ళు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్తే మేము రావడానికి సిద్దమన్నారు. దళిత బంధుతో మంచి ఆలోచన చేసిన సీఎం కెసిఆర్.. ఎస్సీ వర్గీకరణ పై దృష్టి పెట్టాలని సూచనలు చేశారు. హుజూరాబాద్ కోసమే కరీంనగర్ కలెక్టర్ కి నిధులు పంపించారని… మిగిలిన పైలట్ మండలాల్లో జిల్లా కలెక్టర్ లకు నిధులు బదిలీ అయ్యాయా..? లేదా..? అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.