శాసనసభ సమావేశాల్లో దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వల్లే దళిత బంధు ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటికే దళితబంధుపై ఆల్ పార్టీ మీట్ లో చర్చించాము. దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకువచ్చింది కాదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 119 నియోజకవర్గాల్లో అమలు చేస్తామన్నారు. ఈ మార్చి లోపల దళితబంధు పూర్తి స్థాయిలో పథకాన్ని అమలు పరుస్తామని తెలిపారు. కరోనా వల్ల రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని లేకపోతే గతేడాదే దళితబంధు ప్రారంభం కావాల్సిందని సీఎం కేసీఆర్ తెలపారు. దళితబంధులో లబ్ధిదారులకు పూర్తి స్వేచ్చ ఉంటుందని, వారికి నచ్చిన పని చేసుకోవచ్చని సీఎం తెలిపారు. లబ్ధదారులు తమకు నచ్చిన చోట వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. వచ్చే బడ్జెట్లో దళితబంధు కోసం రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు.