జగన్ చేతిలో బాబు ఫ్యూచర్ ప్లాన్స్… ఇది వేరే!!

-

ఏ రాజకీయ నాయకుడికైనా వారి వారి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆలోచనలు ఉంటాయి.. లేదు ఆయనే అధినేత అయితే తాజా రాజకీయ పరిస్థితులను బట్టి, వారి సొంత ఆలోచనలు బట్టి నడుచుకుంటారు. అయితే… చంద్రబాబు విషయంలో మాత్రం అలా లేదు.. అలా జరగడం లేదు! ప్రస్తుతం జగన్ ఎలా ఆలోచిస్తున్నారు అన్నదానిపై ఆధారపడి చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుంటున్నారు! ప్రస్తుతం అలా దిగజారిపోయింది బాబు రాజకీయ జీవితం!

అవును… మోడీ & కో ప్రస్తుతం జగన్ నామ జపం చేస్తున్న తరుణంలో బాబు ఇప్పుడు వేరే ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అవును… మోడీ ఆహ్వానాన్ని జగన్ సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు కథనాలు వస్తున్నప్పటికీ.. అది బాబుకు అంతగా ఆనందాన్ని ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే.. జగన్ వద్దన్నా, బీజేపీ మాత్రం టీడీపీ ని పిలిచే ప్రసక్తి లేదు! సో… బీజేపీతో లింక్ కట్ అయినట్లే!

ఈ తరుణంలో నెక్స్ట్ జగన్ గనుక తృతియ ఫ్రంట్ వైపు చూడని పక్షంలో… బాబు ఆ దిశగా ఆలోచించడం, కమ్యునిస్టుల జపం చేయడం, కాంగ్రెస్ నాయకులతో వేదికలు పంచుకోవడ, సైకిల్ ని హస్తం కి అప్పగించడం! ఈ పరిస్థితిఉల్లో జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమిలోకి దూకేలా బాబు ఆలోచనలు ఉన్నాయని అనుకోవచ్చు!! సో… ఇప్పుడు బాబు ఆలోచనలు తన సొంతంగా అమలు చేయలేని పరిస్థితుల్లో… జగన్ ఆలోచనలను బట్టి తన ప్లాన్స్ మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశారు! సో.. బాబు పార్టీకి, బాబు భవిష్యత్తుకు కూడా జగనే డైరెక్టర్ అన్నమాట!!

Read more RELATED
Recommended to you

Exit mobile version