టిడిపి అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రోడ్లపై చొక్కా చించుకొని కాగితాలు ఏరుకునే పరిస్థితిలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు.
రాజకీయాలలో ఒక్కోసారి పూలు పడుతుంటాయి, ఒక్కోసారి రాళ్లు పడుతుంటాయి.. వాటిని స్వీకరించాలి తప్ప రండి కొట్టుకుందాం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ తీరు కూడా ఇలాగే ఉందనిఅన్నారు. అసలు పవన్ కళ్యాణ్ లో రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే లేవన్నారు. ఇక నారా లోకేష్ పాదయాత్ర పై స్పందిస్తూ.. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ ప్రజలను రెచ్చగొట్టడం పాదయాత్ర కాదని. పాదయాత్ర అంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసింది చరిత్రలో నిలిచిపోయేదని తెలిపారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ పెను మార్పులు తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు.