టిఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు – ఈటెల రాజేందర్

-

టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కెసిఆర్ సర్కారు ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. ఏ ప్రభుత్వం ఇటువంటి నీచమైన పనులు చేయలేదని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ పైన దాడికి పాల్పడ్డారని.. ఇప్పుడు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షాకు లేఖ రాస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్నారు.

టిఆర్ఎస్ సమాజాన్ని అల్లోకల్లోలం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కెసిఆర్ తన కుటుంబం కోసం మాత్రమే ఉన్నారని.. ప్రజల కోసం లేరని టిఆర్ఎస్ కార్యకర్తలకు అర్థమైంది అన్నారు. బిజెపి కార్యకర్తల రక్తాన్ని కళ్లచూసి పార్టీని బతికించుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజల పైనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అన్నారు ఈటల రాజేందర్. పోలీసులు కూడా కేసీఆర్ కి బానిసలాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version