ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే పెద్ద విజయం. కానీ ఒకసారి ప్రజల్లో నమ్మకం కోల్పోతే మాత్రం దాన్ని సంపాదించడానికి ఏండ్ల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని ఓ విషయంలో పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ విషయంపై ఆయనే మాట్లాడటం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. అదేంటంటే లుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే పేదల గృహణాలను పూర్తిగా రద్దుచేస్తామంటూ ఆయన ఇప్పుడు హామీ ఇస్తున్నారు. నిజానికి రుణాలరద్దు అంటే ముందుగా చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారు.
ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో రైతురుణాలతో పాటుగా డ్వాక్రారుణాలు అలాగే చేనేత రుణాలు రద్దు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కాగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లోటుబడ్జెట్ కారణంగా రుణమాఫీలను కుదించి, కుదించి చాలా తక్కువగా చేసింది. ఈ ఎఫెక్ట్ ఆయన్ను 2019 ఎన్నికల్లో ఓడిపోయేలా చేసిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన రుణమాఫీని తెరమీదకు తెస్తున్నారు. పేదలు తీసుకున్న గృహరుణాలను మాఫీ చేస్తామంటున్నారు.
మరి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను మర్చిపోయిన చంద్రబాబు ఇప్పుడు ఎలా మరచిపోయారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి గతాన్ని పక్కన పెడుతూ చంద్రబాబు చేస్తున్న హామీలను జనాలు నమ్ముతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. కాగా ఈ విషయంలో చంద్రబాబు కంటే జగన్ చేసిచూపిస్తే గనక అది వైసీపీకి పెద్ద ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరి చంద్రబాబు చేసినట్టే జగన్ కూడా చేస్తారా లేదంటే మాట నిబడి మాఫీ చేస్తారా అన్నది చూడాలి. ఇకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరినైనా ప్రజలు దింపేస్తారని గుర్తుంచుకోవాలి.