అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీ యువకుడిపై అక్రమ కేసులు బనాయించారని లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొడవళూరు మండలం కమ్మపలేం గ్రామానికి చెందిన కరాకట మల్లికార్జున్ పై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. కొడవలూరు పోలీసులు మల్లికార్జున్ పైనే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయటంతో పాటు అతనిపైనే రౌడీ షీట్ తెరిచారని చెప్పారు. పైడేరు కాల్వలో వైసీపీ నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకే ఈ విధంగా మల్లికార్జున్‌ని వేధించారని లేఖలో చంద్రబాబు తెలిపారు.
ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. వీడియో కూడా..!
-