సంక్రాంతికి ఊరెళ్ల‌నంటున్న చంద్ర‌బాబు.. ఎందుకో తెలుసా..?

-

ప్రతీ ఏటా చంద్రబాబు సంక్రాంతి వేడుకల్ని తన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించుకుంటారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కుటుంబంతో సహా స్వగ్రామానికి వెళ్లి ఆయన పూజలు కూడా నిర్వహించారు. అయితే ఈసారి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లరాదని నిర్ణయం తీసుకున్నారు. నారావారిపల్లెలో ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలకు నారా కుటుంబసభ్యులు, అటు నందమూరి కుటుంబసభ్యులు కలుసుకుని సందడి చేస్తుంటారు.

అయితే, అమరావతిలో రైతులు ఆందోళనలు చేపడుతున్న తరుణంలో తాను సంక్రాంతి జరుపుకోవడం సబబు కాదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు సంక్రాంతికి స్వగ్రామం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకుని, రైతులకు మద్దతుగా అమరావతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version