చంద్రబాబు మార్క్ పాలిటిక్స్: ఎన్టీఆర్ మైనస్…పవన్ ప్లస్..?

-

చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎలాగో ఆ పార్టీకి కాలం చెల్లిపోయింది. అయితే ఏపీలో మాత్రం పార్టీకి కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల నుంచి బయటపడేయాలంటే టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని, పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని పలువురు అభిమానులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు, లోకేష్‌లు పాల్గొనే సభల్లో కొందరు అభిమానులు జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ బ్యానర్లు కడుతూ, స్లోగన్లు ఇస్తున్నారు.

Nara Chandrababu Naidu |

ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ బ్రతుకుతుందని మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు అంత తేలికగా ఎన్టీఆర్‌ని పార్టీలోకి తీసుకురావడం కష్టమే. ఒకవేళ వచ్చిన తన తనయుడు లోకేష్‌కే ఇబ్బంది అవుతుంది. అందుకే ఎన్టీఆర్‌ని పార్టీలోకి ఆహ్వానించే పరిస్తితి కనిపించడం లేదు. అలా అని ఎన్టీఆర్ కూడా ఇప్పటిలో రాజకీయాల్లో వచ్చేలా కనిపించడం లేదు.

అయితే చంద్రబాబుకు ఎన్టీఆర్ పార్టీలో రావడం కంటే, పవన్‌తో పొత్తు పెట్టుకోవడమే ప్లస్ అవుతుందని కొందరు తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఎదురుకోవాలంటే చంద్రబాబు బలం సరిపోదు. పవన్ కూడా తోడైతేనే జగన్‌ని ఢీకొట్టడం బాబుకు సులువు అవుతుందని చెప్పొచ్చు. పైగా పవన్ విడిగా పోటీ చేయడం వల్ల బాబుకే మైనస్ అవుతుంది. 2014లో పవన్ సపోర్ట్ చేయడం వల్లే బాబుకు అధికారం దక్కిందని చెప్పొచ్చు.

కానీ 2019 ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి నష్టం జరిగింది. అదే సమయంలో వైసీపీకి లబ్దిచేకూరింది. దాదాపు 50 పైనే స్థానాల్లో జనసేన ఓట్లు చీల్చి టీడీపీని దెబ్బకొట్టింది. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్‌ని కలుపుకుని ముందుకెళితేనే టీడీపీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version