బన్నీ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చిరవర్ లో అంటే డిసెంబర్ 25 వ తారుఖున అన్నీ థియేటర్ల లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే చిత్ర బృందం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ క్రిస్మస్ మరింత ఐకానిక్ గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. కాగా ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version