అబద్ధం..అబద్ధం.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

-

మైలవరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన ఖండించారు. అక్కడ 50 ఏళ్లుగా మైనింగ్ జరుగుతోందని కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు తాను మైనింగ్ చేస్తున్నానడం విడ్డూరం ఉందన్నారు. ఆ మైనింగ్‌కు అనుమతు తెచ్చింది దేవినేని ఉమనే అని కృష్ణప్రసాద్ ఆరోపించారు. గతంలో మైనింగ్ క్వారీ భూములపై కలెక్టర్ అభ్యంతరం చెబితే అప్పటి మంత్రి కేఈ కృష్ణ మూర్తితో దేవినేని ఉమ అనుమతి తీసుకురాలేదా? అని ప్రశ్నించారు. తాను మైనింగ్ చేస్తున్నారనడం అబద్ధమని చెప్పారు. క్వారీలు, మైనింగ్‌పై చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. 50 ఏళ్లలో జరిగిన మైనింగ్‌కు తనకు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. సానుభూతి కోసమే రెచ్చగొట్టి దేవినేని ఉమ అరెస్ట్ అయ్యారని కొట్టిపారేశారు. నిజనిర్దారణ కమిటీ వచ్చి ఏం చేస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు.

కాగా వసంతప్రసాద్ అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతున్నారని.. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు దేవినేని ఉమ అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు భారీగా చేరుకుని గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో దేవినేని ఉమతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో టీడీపీ నేతలు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ ప్రాంతానికి నేడు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు.. పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు.

 

అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దేవినేని ఫ్యామిలీని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version