క్లారిటీ: డీబీటీ… బాబుకున్న ప్రాబ్లం ఏమిటీ?

-

ప్రజలకు గతం ఏమాత్రం గుర్తుండదు.. నిన్నది నిన్నే నేటిది నేడే అన్న చందంగా ముందుకుపోతుంటారు అని నమ్ముతూ ఇంతకాలం బాబు రాజకీయాలు చేసుకుంటూపోయిన సంగతి తెలిసిందే! అయితే రోజులు మారాయి, జనం అప్ డేట్ అయ్యారు. ఏది నిజం ఏది అబద్దం, ఎవరిది నిజం మరెవరిది అబద్దం, ఎవరు ప్రజల తరుపున ఉన్నారు ఇంకెవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతమే ప్రజల గురించి ఆలోచిస్తున్నట్లు మాట్లాడుతున్నారు అన్నది గ్రహించే స్థ్తిలో ఉన్నారు. ఈ విషయాలు మరచిన బాబు… డీబీటీ ని తప్పుపడుతున్నారు!

పెరిగిన విద్యుత్ చార్జీలకోసం రైతులు, ప్రజలు రోడ్లెక్కితే పోలీసులతో కాల్పించిన చరిత్ర బాబు సొంతం! విద్యుత్ బిల్లులు చెల్లించలేదని రైతులను పోలీస్ స్టేషన్ లకు రప్పించిన పాలన బాబు సొంతం. రైతులకిచ్చే విద్యుత్ హెచ్.పి. ధరను రూ. 50 నుంచి ఏకంగా రూ. 650కి పెంచిన ఘనత బాబు సొంతం. ఒకానొక దశలో ఏకంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని ఆలోచనలు బాబు పాలనలో, రైతులపై కక్షలో భాగం! ఇన్ని చేసిన బాబు… వ్యవసాయ విద్యుత్ కు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంటే బాబు వచ్చిన నష్టం ఏమిటి?

బాబు పాలనతో పోలిస్తే రైతులు హ్యాపీగా ఉన్నారు! రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు ముందుగా డబ్బులు చెల్లించేసిన అనంతరం ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ చేస్తాది అని అంటే తప్పు కానీ… ముందుగానే ప్రభుత్వమే ముందుగా చెల్లిస్తాది అని అంటే అందులో విమర్శించడానికేముంది? బాబు కే అర్ధం కావాలి? ఇవన్నీ తెలిసి కూడా కేవలం ప్రభుత్వానికి మంచి పేరు ఎక్కడ వచ్చేస్తాదో అన్న అక్కసుతోనే.. చంద్రబాబు డీబీటీ అనేది రైతు మెడకు ఉరితాడు అని చెప్పుకొస్తున్నరే తప్ప… ఇందులో రైతులపై ప్రేమ ఏది? అది ఉంటే బాబుకు నేడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది?

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version