మరో వివాదంలో చిక్కుకున్న కార్వీ కన్సల్టెన్సీ

-

మరో వివాదంలో కార్వీ కన్సల్టెన్సీ యజమాని చిక్కుకున్నారు. కార్వీ కన్సల్టెన్సీ సంస్థ పై పోలీసులు కేసు నమోదు చేసారు. కస్టమర్ల సెక్యూరిటీలను సొంతం అవసరాలకు కార్వీ ఉపయోగించుకున్నట్టు గుర్తించారు. నిజానికి గతేడాది స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈలు కార్వీ స్టాక్ బ్రోకింగ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను రద్దు చేశాయి. కార్వీ సంస్థపై గతేడాది డిసెంబర్ లో మార్కెట్‌ రెగ్యులేటర్ సెబీ నిషేధం విధించింది కూడా.

అప్పుడు కార్వీ సంస్థ ఏకంగా 2 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్ లైసెన్స్‌ను మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్) కూడా రద్దు చేసింది. దీంతో కార్వీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లు ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ చేయడం కుదరదు. అయితే ఇప్పుడు తాజాగా పవర్ ప్లాంట్ షేర్ల వ్యవహారంలో గోల్మాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పార్థసారథి పై పవర్ ప్లాంట్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో పార్థసారథిని పిలిచి విచారణ చేసిన పోలీసులు 41 సిఆర్పిసి నోటీసు ఇచ్చి పార్థసారథి పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version