మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి పలు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రధానితో భేటీ అంశంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నాం అని విజయసాయిరెడ్డి చెప్పారు. టిడిపి అంటేనే తెలుగు దొంగల పార్టీ అని, చర్చల కోసం దొంగల ముఠా నాయకుడు చంద్రబాబునాయుడు వచ్చినా తాము సిద్ధమేనని వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు.
ప్రజా సమస్యల గురించి ప్రధానిని కలిస్తే తనను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఇవాళ రాజ్యసభలో జరిగిన దానికి ఏం సమాధానం చెబుతారని విజయసాయిరెడ్డి అన్నారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్ళు పట్టుకోవడం చంద్రబాబుతో పాటు టిడిపి నాయకుల నైజం అని విజయసాయి అన్నారు.” చంద్రబాబు.. మీరు ఓ చార్లెస్ శోభరాజ్.. మీ అంత దుర్మార్గపు నాయకుడు ఈ దేశంలోనే లేరు అని మండిపడ్డారు.