మద్యం బ్రాండ్లపై బాబు ఆవేదన ఇది!

-

మద్యపాన నిషేదంపై ప్రజలకు మాట ఇచ్చి అధికారం సంపాదించిన నాయకుడు స్థాపించిన పార్టీ… నేడు మద్యంలో బ్రాండ్లు, వాటి ధరలపై గగ్గోలు చేస్తున్న పరిస్థితి! ఈ రాజకీయ అవకాశం టీడీపీకి దక్కిందనే చెప్పాలి! కాకపోతే… నాడు మద్యపాన నిషేదం కోరుకున్నది నందమూరి తారకరామారావు కాగా… నేడు మద్యంలోని బ్రాండ్ల గురించి తెగ బాదపడుతున్నది చంద్రబాబు నాయుడు! ఈ విషయం చంద్రబాబు ఏకంగా ప్రజలనుద్దేశించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయారన్నా అతిశయోక్తి కాదేమో!

వివరాళ్లోకి వెళ్తే… ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, జరుగుతున్న పరిణామాల మీద చంద్రబాబు దాదాపు ప్రతిరోజూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అలా అని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాల తరలింపు వ్యవహారం గురించి కాదు సుమా… ఏపీలో మద్యం అమ్మకాలు, అక్కడ దుకాణాల్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లు, వాటి ధర, తద్వారా జరుగుతున్న ఇబ్బందులు గురించి!

అవును… ఏపీలో మద్యం అమ్మకాల కారణంగా రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మూడు రకాల నష్టాల గురించి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిలో మొదటిది… నాసిరకం బ్రాండ్ గురించి! అవును… ప్రస్తుతం ఏపీలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లు అన్నీ నాసిరకానివని, అలాంటి బ్రాండ్ల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని బాబు ఫీలవుతున్నారు! ఇదే క్రమంలో భారీగా ధరలు పెంచేయటం ద్వారా మందుబాబుల జేబులు గుల్ల అవుతున్నాయని కూడా ఫీలవుతున్నారు. ఇక కరోనా వచ్చినప్పటినుంచీ పొరుగురాష్ట్రంలో తలదాచుకుంటున్న బాబు… మద్యం కోసం ఏర్పాటైన గుంపులు వల్ల భారీగా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

కాగా… రాష్ట్రంలో ఇంక ఎలాంటి సమస్యలూ లేకుండా జగన్ పరిపాలించబట్టి… మరో ఆప్షన్ లేకే చంద్రబాబు… దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామన్న విషయం మరిచి మద్యానికి సంబందించిన విమర్శలు మాత్రమే చేయగలుగుతున్నారని… వైకాపా నేతలు సెటైర్లు వేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news