సెకండ్ లిస్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన..!

-

టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్టు విడుదలపై పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రేపు టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితాని విడుదల చేస్తామని అన్నారు. సెకండ్ లిస్టు లో ఎంత మంది వీలైతే అంత మంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేస్తామని అన్నారు పొత్తు లో భాగంగా జనసేన బిజెపి ఏ స్థానాలలో పోటీ చేయాలో వారికి స్పష్టత ఉందని అన్నారు.

గురువారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లతో పాటుగా పలువురు ఎంపీ క్యాండిట్ల పేర్లను సైతం ప్రకటిస్తామని బాబు చెప్పారు టిడిపి జనసేన బిజెపి పొత్తులో భాగంగా టిడిపి 175 స్థానాలకు గాను 144 చోట్ల పోటీ చేస్తుందని అన్నారు 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా 17 ఎంపీ సీట్లలో టిడిపి బరిలోకి దిగుతుందని అన్నారు. ఇందులో భాగంగా టిడిపి ఎమ్మెల్యేల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఇందులో 94 స్థానాలకి అభ్యర్థులని ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version