కోనసీమ ఘటనపై స్పందించిన చంద్రబాబు..

-

ఇటీవల ఏపీ ప్రభుత్వం నూతన జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలకు కొన్ని పేర్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ జిల్లాగా మార్చడంపై జిల్లాలో భిన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో.. నిన్న అమలాపురంలో నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశారు. నిరసనకారులు నిన్న అమలాపురంలో తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు నిప్పటించారు. అయితే ఈ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.

కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమని అన్నారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version