పసిడి ప్రియులకు షాక్‌.. పెరిగిన బంగారం ధరలు..

-

మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర పరుగులు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిన్నటితో పోలిస్తే నేడు గ్రాముకు ఏకంగా రూ.60 చొప్పున పెరిగింది. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,090 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,100 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ..
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version