మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించిన చంద్రబాబు

-

మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. పదో తరగతి పరీక్షల నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్ట్ అరెస్టు చేశారని మండిపడ్డారు చంద్రబాబు. నారాయణ అరెస్టు పూర్తిగా కక్షపూరిత మన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందన్నారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందన్నారు.

rayana

మాస్ కాపీయింగ్ కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు.. నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారు.. అంటూ మండిపడ్డారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. విచారణ చేయకుండా, ఆధారాలు లేకుండా నేరుగా అరెస్టు చేయడం కక్షపూరిత చర్య కాదా? జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version