చంద్రబాబు: ఏపీ డీజీపీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలి..!

-

ఏపీలోని పాలన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై జగన్ గూండా రాజ్ మాత్రమే నడుస్తోందని అన్నారు చంద్రబాబు. మార్టూరులో మైనింగ్ తనిఖీలు అలానే క్రోసూరు లో రౌడీల విధ్వంసానికి పోలీసుల సహకారం పూర్తిగా గాడి తప్పిన పాలనకి నిదర్శనమని అన్నారు చంద్రబాబు. మార్టూరులో మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరుతో చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా అని అన్నారు. మైనింగ్ శాఖలో అధికారి రౌడీలతో తనిఖీలకి వచ్చిన ఘటన గుండా రాజకీయ ఉదాహరణగా నిలుస్తుంది అన్నారు.

ఎమ్మెల్యే కొడుకు వందల మందితో ప్రజల ఆస్తులపై క్రోసూరులో దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించారని అనరు చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఘటనపై స్పందించని డీజీపీ ఎందుకు అన్నారు చట్టాన్ని అమలు చేయని జిల్లాలో ఎస్పీలు కాకి యూనిఫామ్ తీసేసి వైకాపా జెండా అనే యూనిఫామ్ గా కుట్టించుకోవాలని అన్నారు చంద్రబాబు. ఏపీ డీజీపీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలి అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news