ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయంగా ఆయన కుటుంబం ఒక వెలుగు వెలిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన ఆయన ఒకానొక దశలో ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు అనే ప్రచారం కూడా జరిగింది. వైఎస్ మరణం తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయడం ఆ వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం, కొన్నాళ్ళకు రాష్ట్ర విభజన జరగడం, కొన్నాళ్ళకు ఆయన టీడీపీ లోకి వచ్చి ఎంపీ అవ్వడం వంటివి వేగంగా జరిగిపోయాయి, ఎంపీ గా ఉన్నా సరే ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి అనే మాట అక్షరాలా నిజం. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చంద్రబాబుని బాగా ఇబ్బంది పెట్టాయి.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నుంచి కూడా ఆయనకు సహకారం అందడం లేదు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ 10 నెలల కాలంలో ఆయన రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయారు. ఇప్పుడు ఆయన టీడీపీని వీడే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన టీడీపీని వీడితే ఆరు నియోజకవర్గాలలో పార్టీ చచ్చిపోవడమే. పరిటాల రవి మరణం తర్వాత టీడీపీకి అంత సమర్ధుడు దొరకలేదు.
ఇప్పుడు జేసీ రూపంలో జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు ఉంది. ఇప్పుడు ఆయన పార్టీని వద్దు అంటే మాత్రం, కళ్యాణ దుర్గం, తాడిపత్రి, అనంతపురం టౌన్, రూరల్, పెనుకొండ, ధర్మవరం, సింగనమల నియోజకవర్గాల్లో పార్టీ ఇబ్బంది పడుతుంది. ఆయనకు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాల్లో మంచి వర్గం ఉండేది. తాడిపత్రిలో ఆయనకు తిరుగు ఉండేది కాదు. ఇప్పుడు ఆయన మారితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయితీలు గెలవడం కూడా కష్టమే. ఆయన స్థాయిలో కార్యకర్తలను, పేరు పెట్టి పిలిచే నాయకుడు జిల్లాలో లేరు.