కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఆయనతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారులపై, అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్ట్ అయ్యే రహదారుల మార్గాలపై గడ్కరీతో చంద్రబాబు చర్చించారు. అలాగే అమరావతి – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ వేపై కూడా కేంద్రమంత్రి గడ్కరీతో చర్చించినట్లు సమాచారం. దీనిని త్వరగా పూర్తి చేయాలని, అందుకోసం ఖర్చయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
కాగా, సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయిన చంద్రబాబు ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు.పోలవరం నిర్మాణానికి కేంద్రం మరో రూ.2,800 కోట్లు మంజూరు చేయగా.. అడ్వాన్స్‌గా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు టీడీపీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. అదేవిధంగా రూ.30,436 కోట్ల డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని, మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపింది.