హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ-20 మ్యాచ్ లా తలపించాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకెల్లింది. దీంతో కాంగ్రెస్ ముందంజలో ఉందని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు కూడా జరుపుకున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా బీజేపీ పుంజుకొని ముందంజలోకి వచ్చింది. ఉదయం చూసిన ఫలితాల్లో కనీసం బీజేపీకి 20 స్థానాలైనా వస్తాయా..? అనే అనుమానం కలిగింది. కానీ కొద్ది సేపటికీ ఫలితాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం హర్యానా లో కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపాయి.
హర్యానాలో అనూహ్యంగా బీజేపీ ముందంజలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 49 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. హర్యానాలో 67.90 శాతం ఓటింగ్ నమోదు అయింది. 90 అసెంబ్లీ సీట్లు ఉన్న హర్యానాలో 46 సీట్లు సాధించిన వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి అదనంగా మూడు లేదా నాలుగు సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేష్ ఫొగట్ విజయం సాధించింది.