వైసీపీకి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాటం చేయాలి : పొత్తులపై చంద్రబాబు సంచలనం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయాలపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు. YCP ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజా ఉద్యమము రావాలి.. దానికి తెలుగుదేశం నాయకత్వము వహిస్తుందని వెల్లడించారు. అవసరం అయితే త్యాగాలు చేయడానికి సిద్ధం ఉన్నామని స్పష్టం చేశారు.

ఇక రేపల్లె రైల్వే స్టేషన్ లో రేప్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. విజయవాడ హాస్పిటల్ లో ముగ్గురు వ్యక్తులు ఆడపిల్ల కు ముప్పై గంటల పాటు నరకము చూపించారన్నారు చంద్రబాబు. రేప్ లు టీ డీ పీ కారణం అని అంటున్నారు అసలు సిగ్గు ఉందా ? అని నిలదీశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలన్నారు. నేను పడ్డ కష్టం బూడిద లో పోసిన పన్నీరు అయింది.. పోలవరం డయాగ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి నేను కారణం అంటున్నారని మండిపడ్డారు. భార్య భర్తలు విడిపోయిన నేనే కారణం అంటారు ఏమో? పదో తరగతి పరీక్షలు నిర్వహించని సీఎం మూడు రాజధానులు ఎలా కడతాడని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version