తెలుగు దేశం పార్టీ చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ….చంద్రబాబు సీఎంగా 14 ఏళ్లు పనిచేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు.రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సీఎం గా జగన్ అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేశారు అని అన్నారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూపిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది అని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో పేర్గొన్న అంశాలన్నీ ఆచరణలో అమలు చేసిన ఏకైక నేత జగన్ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చంద్రబాబు సరికొత్త నాటకాలు ఆడుతున్నారని ,అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటు అని విమర్శించారు.చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 14 ఏళ్ల సీఎం గా చేశాడు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు.. 14 సంవత్సరాలు సీఎం గా చేసిన చంద్రబాబుకి కనిపించలేదా..? అని ప్రశ్నించారు ధర్మాన. ఐదేళ్ల పాలనలో ఉద్దాన ప్రాంతాన్ని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పిన ఘనత జగన్ది అని అన్నారు.