‘రాయన్’గా వస్తున్న ధనుష్…..

-

ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న 50వ సినిమా టైటిల్ను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి ‘రేయాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.మూవీ టైటిల్ తో పాటు ధనుష్ లుక్ను రివీల్ చేసింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ ,దుసారా విజయన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది.

గత డిసెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు ధనుష్ ప్రకటించారు. ‘రేయాన్’ టైటిల్ తో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి కనిపిస్తోన్నాడు. ఇక అతని వెనుక, సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్ చేతిలో కత్తులు ఉన్నాయి. మూవీ లో హింసకు లోటు ఉండదని పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతోంది. ఇక ఈ కాంబినేషన్ కొత్తగా ఉండడం అభిమానులకి ట్రీట్ ఖాయం అని అంటున్నారు.నార్త్ చెన్నై కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news