సీఎస్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటాం !

-

వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అత్యవసర భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరిపితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నా.. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోందని అన్నారు. వ్యాక్సిన్ వేసుకోకుండా ఎన్నికల విధుల్లోకి వెళ్లమని అందరూ చెబుతున్నారని ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారని అన్నారు.

వీలైనంత త్వరలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్న ఆయన ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా బారిన పడి చనిపోతే రూ. 50 లక్షలు పరిహరం ఇవ్వాలని కోరామని అన్నారు. ఇప్పటికీ కరోనా భయం వెన్నాడుతోందని, సీఎస్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటామని స్నన్స్టు. ఇక ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ మేం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయలేదని, అన్ని సంఘాలను ఒకే గాటన కట్టొదని అన్నారు. వివిధ హోదాల్లో ఉన్న వారికి ఎన్నికల విధుల్లో ఎదురయ్యే ఇబ్బందుల విషయమై వినతులిచ్చామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news